నీరసించిన  రోజా  - నిమ్స్ కి తరలింపు ...

Ysrcp MLA Roja Admitted To NIMS

06:15 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Ysrcp MLA Roja Admitted To NIMS

అసెంబ్లీ లో బయట గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో నిమ్స్‌కు తరలించారు. శనివారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో రోజా అసెంబ్లీ ఆవరణ‌లో దీక్షకు దిగారు. ఎండలో మూడు గంటల పాటు రోజా దీక్షకు దిగడంతో హైబీపీతో నీరసించిపోయారు. దీంతో పడుకుని దీక్షను కొనసాగించడంతో వైసీపీ ఎమ్మెల్యే అక్కడకు చేరుకుని రోజాను అంబులెన్స్‌లో నిమ్స్‌కు తరలించారు. మరోవైపు రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు

సోమవారానికి అసెంబ్లీ వాయిదా ...

వైసీపీ నేతల గందరగోళం మధ్య ఏపీ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు నల్లదుస్తులతో శాసనసభకు వచ్చారు. సభ మొదలుకాగానే నిరసన వ్యక్తం చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. అడుగడుగునా సభను అడ్డుకున్నారు. సభలో వైసీపీ సభ్యులు నిరసన తెలిపడంతో స్పీకర్ డాక్టర్ కోడెల సభను వాయిదా వేశారు. స్పీకర్ నచ్చజెప్పినా వినలేదు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. తన ప్రసంగాన్ని అడ్డుకుంటూ ఉండటంతో బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌ రాజు వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. అయినా వారు మార్పు రాలేదు. . నినాదాలు కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను 10 నిమిషాలపాటు వాయిదా వేశారు. రెండో సారి సభ మొదలైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పురాలేదు. దీంతో స్పీకర్ మరోసారి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సభ మొదలైన తర్వాత పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

రోజా వ్యవహారంపై సోమవారం చర్చ ....

కాగా రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ వ్యవహారంపై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సభలో సభ్యులకు పంపిణీ చేయడం ద్వారా సోమవారం చర్చ కు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది, ఈ మేరకు ప్రకటన కూడా వచ్చింది. వ్యూహ్యాత్మకంగా రోజాను సభకు రాకుండా అడ్డుకోవడం ద్వారా చర్చః తర్వాత సభ నిర్ణయం మేరకు నడుచుకోవాలన్న ఎత్తుగడ వేసింది, మరోపక్క అసెంబ్లీ కార్యదర్శి ద్వారా హైకోర్టులో అప్పీలు కి వెళ్ళింది, అప్పీలు పై కూడా సోమవారమే విచారణ జరుగనుంది.

సర్దార్ కి పాస్ లున్నవారే రావాలి

సర్దార్ టైటిల్ సాంగ్ లీక్.. చూస్కో గురూ..

కూతురిని కాటేసిన కామాంధుడు

English summary

Ysrcp Suspended MLA Roja Admitted to NIMS hospital. Roja was stopped by the Marshals in Andhra Pradesh Assembly.