జగన్ కి షాకిస్తుందా? - నిలబడుతుందా?

Ysrcp MLA Roja May Say Sorry To Assembly

04:51 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Ysrcp MLA Roja May Say Sorry To Assembly

సారీతో గట్టెక్కాలని రోజా ప్రయత్నమట...

ఇప్పటికే పలువురు వైసిపి నేతలు జగన్ ను వీడి టిడిపిలోకి జంప్ చేస్తుంటే , కడప జిల్లా వైసిపి ఎం ఎల్ ఎ ఆది నారాయణ రెడ్డి కూడా ఆదిశగా అడుగులు వేస్తుంటే , ఇక తానూ సైతం అన్నట్లు ఆపార్టీ మహిళా ఎం ఎల్ ఎ సినీ నటి రోజా కూడా జగన్ కి షాకివ్వ బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజా కూడా ఆ గూటి చిలకే కదా. ఎందుకంటే , ఒకప్పుడు టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలి గా పనిచేసి , కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడిన విషయం అందరికీ ఎరుకే.

ఇంతకీ అసలు విషయమేమంటే , అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో చంద్రబాబుతో పాటు టీడీపీ మహిళా ఎమ్మెల్యేపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజా కోసం జగన్ బృందం అసెంబ్లీలో నానా రగడ చేసి , చివరకు సమావేశాలను కూడా బహిష్కరించారు. . అయితే జగన్ ప్రొత్సాహంతో అసెంబ్లీలో రెచ్చిపోయి, మాట్లాడిన రోజా… కొద్దిరోజులుగా ఆ పార్టీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని ఆవేదన చెందుతున్నట్టు బోగట్టా. జగన్ ను నమ్ముకుని ఇదే విధంగా ముందుకు వెళితే… తన రాజకీయ జీవితం ఎక్కువ రోజులు కొనసాగదనే అంతర్మధనంలో వున్న రోజా… స్పీకర్ వేసిన త్రిసభ్యకి ముందు తన వాదనలు వినిపించి , అవసరమైతే కమిటీకి క్షమాపణలు చెప్పేందుకు కూడా వెనుకాడరాదనీ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

రోజా సస్పెన్షన్ ,సిడిలు బయటకు రావడం వంటి పరిణామాలపై అలాగే సస్పెన్షన్ తగ్గించాలా , పొడిగించాలా వంటి విషయాలపై ఉప సభాపత్గి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన శ్రవణ కుమార్ (టిడిపి), శ్రీకాంత్ రెడ్డి (వైసిపి), విష్ణు కుమార్ రాజు (బిజెపి) సభ్యులుగా ఓ కమిటీని స్క్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు ఏర్పాటుచేసి , 20రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచిన సంగతి తెల్సిందే. కమిటీ ముందు క్షమాపణ చెప్పడం ద్వారా, అసెంబ్లీకి క్షమాపణ చెబితే శిక్ష తగ్గుతుందని కొందరు టీడీపీ నాయకులు అదే , పాత మిత్రులు ఆమెకు సలహా ఇచ్చేసారని ప్రచారం. దీంతో దొరికిందే అవకాశం అన్నట్లుగా ఆమె అందుకు అనుగుణంగా గుట్టుగా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ విషయంలో జగన్ కు సమాచారం ఇవ్వకుండా నేరుగా ఆమె తన నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉందని రోజాకు సన్నిహితంగా ఉన్న కొందరు భావిస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ మహిళా ఎమ్మెల్యేపై తాను చేసిన వ్యక్తిగత ఆరోపణల కారణంగా తన ప్రతిష్ట దిగజారిందని తెలుసుకున్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే… ఇలాంటి చర్యల వల్ల రాజకీయంగా నష్టమే తప్ప లాభం వుండదన్న వాస్తవాన్ని ఆలస్యంగా నైనా గ్రహించినట్లు కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.

అసెంబ్లీకి రోజా సారీ చెప్పినా…ఆమెకు వేసిన శిక్షలో మార్పు ఉండదని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా… అసెంబ్లీకి రోజా క్షమాపణలు చెబితే… జగన్ శిబిరంలో కలకలమే.... మొత్తానికి అసెంబ్లీ కమిటీ లో వున్న ఆ నలుగురి చేతిలోనే రోజా భవితవ్యం ఆధారపడి వుంది. వారిచ్చే నివేదికే కీలకం కదా మరి.

English summary

We all know Ysrcp MLa Roja had been suspended from assembly for one year.Now romours coming that she may say sorry to assembly to lift the ban on her