వైసిపి ఎంఎల్ఎ  అరెస్టు 

YSRCP MLAs Arrested

05:50 PM ON 18th January, 2016 By Mirchi Vilas

YSRCP MLAs Arrested

విమానాశ్రయంలో అధికారిపై దాడి చేసారన్న అభియోగంపై కడప జిల్లా రాజంపేట వైస్సార్ కాంగ్రెస్ పార్గ్టీ ఎంపి మిదున్ రెడ్డిని అరెస్టు చేసి , రిమాండ్ కి పంపగా, తాజాగా మరో కేసులో అదే పార్టీకి చెందిన గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వాధికారుల విధులకు భంగం కలిగించిన కేసులో ఎంఎల్ఎ అరెస్టు అయ్యారు. రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలోని అసైన్ట్‌ భూముల్లో అధికారులు రహదారి పనులు చేస్తుండగా ఎమ్మెల్యే తన అనుచరులతో వెళ్లి అడ్డుకున్నారు. ఈమేరకు తహసీల్దార్‌ రాజారత్నం ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట రూరల్‌ పోలీసులు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్ట్‌కు నిరసనగా వైసిపి కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

English summary

Two YSRCP MLA's arrested in Andhrapradesh. Mithun reddy was arrested in kadapa and another mla gopi mohan reddy was arrested in guntur