వైసీపీ ఎమ్మెల్యేలు తప్పిన ప్రమాదం

Ysrcp MLAs Got Out Of Danger

04:32 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Ysrcp MLAs Got Out Of Danger

సేవ్ డెమొక్రసీ’ ఉద్యమానికి ఆదిలోనే హంసపాదు అన్నట్లు అన్నట్లు తయ్యారైంది. ఎంఎల్ఎ ల వలసల నేపధ్యంలో ఈ ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొద్దిసేపటి కిందట పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. నేతలు హస్తినకు వెళ్లేందుకు సోమవారం ఉదయం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి స్పైస్ జెట్ విమానం ఎక్కారు. రాజకీయ నేతలతోపాటు మరికొందరు ప్రయాణికులు కూడా వున్నారు.ఉదయం 8.45 గంటలకు ఆ విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సదరు విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ల్యాండైంది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెనువెంటనే విమానాన్ని వెనక్కి తిప్పాడు. దీంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ట్రావెలర్స్ టెన్షన్‌కు గురయ్యారు. దీంతో విమానానికి పెద్ద ముప్పే తప్పింది. ఉద్యమం ఆదిలోనే ఇలా జరగడంతో నేతలు తలోవిధంగా చర్చించుకున్నారు. ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గితే మంచిదన్న ఒపీనియన్ అక్కడి నేతల్లో వ్యక్తం అయ్యిందట.

ఇవి కూడా చదవండి:

శ్రీవారి హుండీ దగ్గర లక్ష రూపాయలు కాజేసిన మహిళ

అప్పుడు వద్దన్న బాలయ్య ఇప్పుడు మెగాస్టార్‌ను పిలిచాడు

మెగా హీరోల పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

English summary

Ysrcp MLA's were planned to Go delhi on MLA's jumping to other parties . All Ysrcp MLA's along with Roja planned to go delhi in Spice Jet flight and then the flight landed in few minutes. All YSrcp MLA's were safe .