కావాలనే రోజాను జగన్ ఇరికించాడా...

Ysrcp MLAs Says Sorry To Andhra Pradesh Assembly

10:43 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

Ysrcp MLAs Says Sorry To Andhra Pradesh Assembly

సిఎమ్ పట్ల , సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ఏడాది పాటు సస్పెన్షన్ కి గురైన వైసిపి ఎంఎల్ఎ , నటి రోజా విషయంలో ఒకలాగా , మిగిలిన సభ్యులు , సొంత మీడియా విషయంలో మరోలా జగన్ ఎందుకలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రోజా విషయంలో కోర్టుకి వెళ్ళడం, కమిటీ ముందు హాజరుకాకుండా వుండడం చేస్తుంటే , మిగిలిన సభ్యులు కమిటి ముందుకు వచ్చి క్షమాపణ చెప్పడం వింతగా వుందని విమర్శలు వస్తున్నాయి . అసెంబ్లీలో జరిగిన ఘటనలకు సంబంధించి పొరపాటుగా వార్త ఇచ్చినందుకు సాక్షి పత్రికకు నోటీసు ఇవ్వగా క్షమాపణ కోరుతూ సాక్షిపత్రిక లిఖితపూర్వక లేఖ ఇచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా స్పీకర్‌ డాక్టర్ కోడెల శివప్రసాద్‌ అసెంబ్లీలో వెల్లడించారు.

అలాగే ఏపీ అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు క్షమాపణలు చెప్పడంతో వాటిని శాసనసభ పరిగణలోకి తీసుకుంది. ఈ విషయంలో ప్రివిలేజ్‌ కమిటీ చేసిన సిఫార్స్‌ను కూడా సభ ఆమోదించింది. అలాగే ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట హాజరయ్యేందుకు రోజాకు మరో అవకాశం ఇవ్వాలని సభ నిర్ణయించింది. మరో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై సభ నిర్ణయం తీసుకోనుంది. రోజాకు మరో అవకాశం ఇచ్చిన నేపధ్యంలో ఈ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారన్న దానిపై కూడా స్పష్టత లేదు. క్షమాపణతో సరిపోయే వివాదాన్ని కోర్టు వరకు లాగి , ఇప్పుడు మిగిలిన సభ్యుల విషయంలో క్షమాపణ కోరడం మరి ఏ వ్యూహమోననే గుసగుసలు వినిపిసున్నాయి.రోజాకు చెక్ చెప్పడానికి కావాలనే జగన్ ఇరికించినట్లు ఓ వాదన వినిపిస్తోంది. తెగే వరకూ లాగితే బిగుసుకు పోతుందని గ్రహించి , మిగిలిన సభ్యుల చేత క్షమాపణ చెప్పించేసి , సొంత మీడియా నుంచి కూడా ఆమేరకు లేఖ పంపించి వుంటారనే వాదన వినవస్తోంది. అడుసు తొక్కనేల కాలు కడగనేల అనే సామెతను ఇప్పుడు గ్రహించి వుంటారు పాపం ...

విమానంలో పేలిన ఐఫోన్

72ఏళ్ళ తర్వాత హిట్లర్‌కు వారసుడు పుట్టాడు

సూపర్ స్టార్ కూతురు డాన్స్ అదిరింది

వివాదంలో ఇరుకున్న బిగ్ బి - కేసు నమోదు

English summary

Ysr comgress Party president Jagan Mohan Reddy 's Sakshi Media and Ysrcp MLA's says sorry to Andhra Pradesh Assembly.Recently all were thinking that Jagan was Deliberately Framed MLA Roja.