జగన్ సహా వైసిపి ఎంఎల్ఎ ల సస్పెన్షన్ 

Ysrcp MLA's Suspended From Assembly Sessions

11:47 AM ON 18th December, 2015 By Mirchi Vilas

Ysrcp MLA's Suspended From Assembly Sessions

ఎపి అసెంబ్లీ నుంచి వైసిపి అధినేత జగన్ సహా సభలో వున్న ఆపార్టీ ఎంఎల్ఎ లంతా సస్పెండ్ అయ్యారు. శీతాకాల సమావేశాలలో భాగంగా రెండవరోజు సభలో కూడా కాల్ మనీ వ్యవహారంపై వైసిపి పట్టుబట్టింది. డాక్టర్ అంబేద్కర్ పై చర్చ జరిగాకే కాల్ మనీ పై చర్చకు అనుమతిస్తామని స్పష్టం చేయడం , దీనిపై రాద్ధాంతం కొనసాగడంతో వైసిపి ఎం ఎల్ ఎ లను సస్పెండ్ చేయాలని ఆర్ధిక , శాసన సభా వ్యావాహరాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదిస్తూ , వరుసగా పేర్లు చదివారు. అంబేద్కర్ పై చర్చ జరిగే వరకు సస్పెండ్ వర్తిస్తుందని ప్రకటించారు. సభ అనుమతితో సభాపతి ఈమేరకు తీసుకున్న నిర్ణయంపై , వైసిపి సభ్యులు ఈ గొడవకు దిగారు. సస్పెండ్ అయిన వాళ్ళు బయటకు వెళ్లాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేసారు. పోడియం దగ్గర కు వచ్చి వైసిపి సభ్యులు నినాదాలు చేయడంతో మార్షల్స్ రంగలోకి దిగారు. అంబేద్కర్ పై చర్చను అడ్డుకున్నందుకే సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికార పక్షం పేర్కొంది.

English summary

Andhra Pradesh Assembly speaker Kodela Shiva Prasad Has suspended Ysrcp party MLA's including Jagan from Assembly