ఒక్కో ఎంఎల్ఎ కి రూ 30 కోట్లు ఇస్తున్నారా ?..

YSRCP MLAs were offered Rs 30cr to join TDP

06:25 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

YSRCP MLAs were offered Rs 30cr to join TDP

వలసల పై వైసిపి అధ్యక్షుడు జగన్‌ సీరియస్ అయ్యారు. అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఇంత పెద్దఎత్తున డబ్బు ఎక్కణ్నుంచి వస్తోందని ప్రశ్నించారు. ఇసుక మాఫియాలో మంత్రులు, ఎమ్మెల్యేలు వాటాలు పంచుకున్నారని ఆరోపించారు శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తన బినామీ భూములన్నీ కొన్నాకే చంద్రబాబు రాజధాని ప్రాంతం ప్రకటించారని జగన్‌ ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో అవినీతి వ్యవహారం పై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

సైకిలెక్కిన చాంద్ బాషా

7 రోజుల్లో బరువు తగ్గడం ఎలా?

పాకిస్తాన్ లోనే ఉన్న దావూద్ (ఫోటో)

English summary

Ysrcp President Y.S.Jagan said that Telugu Desham Party was offering 30 crores to their MLA's and purchasing them . He said that he gave complaint to Governor on this Issue.