పాతపట్నం ఎంఎల్ఎ జంప్

Ysrcp Pathapatnam MLA Joins In TDP

01:01 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Ysrcp Pathapatnam MLA Joins In TDP

వైసిపి ఎంఎల్ఎ లు గోడ దూకడం కొనసాగుతోంది. ఇప్పటికే 6గురు ఎంఎల్ఏలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోగా. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసిపి ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖరారైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటిస్తూ, ఈ నెల 4న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తన తండ్రి మోహన్‌రావుతో కలిసి తెదేపాలో చేరుతున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చే పార్టీ మారుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ జంపింగ్ ఇక్కడితో ఆగేట్టు లేదు. మరో కొంతమంది వైసిపి ఎంఎల్ఏలు కూడా అదే దారిలో వెడుతున్నట్లు తెలుస్తోంది.

English summary

Another Ysrcp MLA Kalamata Venkata Ramana Murthy named from Patapatnam From Srikakulam District was joined in Telugu Desam Party(TDP).Upto now 6 MLA's and one MLC joined in TDP and now this count increases to 7.MLA said that he was joining in TDP because of the development activities doing by the Government of Andhra Pradesh.