రియల్ బీస్ట్ వచ్చేసింది..

Yu Yutopia Launched in India

05:39 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Yu Yutopia Launched in India

మైక్రోమాక్స్ అనుబంధ సంస్థ యు తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ యుటోపియాను మార్కెట్ల్ లోకి విడుదల చేసింది. 5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్)తో రిలీజ్ చేసిన ఈ మొబైల్ ధర రూ. 24,999. ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ కు సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. డిసెంబర్ 26న అమ్మకాలు మొదలుకానున్నాయి.

21 మెగాపిల్స్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా దీని ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, 565 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, 32జీబి ఇంటర్నల్ మెమరీ, స్నాప్‌డ్రాగన్ 810 64 బిట్ 1.5 ఆక్టా‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4కె వీడియో ప్లేబాక్ మొదలైన ఫీచర్లున్నాయి. 4జీ కనెక్టువిటీతో పాటు క్వాల్ కామ్ క్విక్ చార్జ్ ఫీచర్ కూడా ఉంది. క్విక్ చార్జ్ 2.0తో 0 నుంచి 60 శాతం చార్జింగ్ 30 నిమిషాల్లోనే ఎక్కేస్తుంది. ఇందులో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మెమరీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. పూర్తి ఎయిర్ క్రాఫ్ట్ మేడ్ అల్యుమినియం మెటల్ బాడీతో హైఎండ్ ఫీచర్లతో రూపుదిద్దుకుంటున్న మొదటి యు ఫోన్ ఇదే. ఫీంగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండటం ఈ ఫోన్ లో అదనపు ప్రత్యేకత. అలాగే యుటోపియాతో పాటు లిటిల్ బర్డ్ ఇయర్ ఫోన్లు కూడా అందిస్తోంది. ఇక యుటోపియా 2 అప్ గ్రేడ్ కు అవకాశం కూడా కల్పిస్తోంది. యుటోపియా వినియోగదారులు కొత్త ఫోన్ ను తీసుకోవానుకుంటే వారి పాత యుటోపియాను తీసుకుని 40 శాతం క్యాష్ బ్యాక్ గా అందజేయనుంది.

తమ యుటోపియా ఫోన్‌ను ప్లానెట్‌లోనే శక్తివంతమైన ఫోన్‌గా రాహుల్ శర్మ అభివర్ణించారు. యుటోపియా రివల్యూషనరీ ప్రాడక్ట్ అని, అరౌండ్ యు సర్వీసులతో మిగతా డివైస్ ల కన్నా యుటోపియా ఐదేళ్లు ముందు ఉందని చెప్పారు. వాస్తవానికి ఈ నెల 7నే ఈ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు యు రంగం సిద్ధం చేసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల రియల్ బీస్ట్ ను గురువారం మార్కెట్ లోకి తెచ్చింది. గత ఏడాది డిసెంబర్ 18నే యు తన తొలి స్మార్ట్ ఫోన్ యురేఖాను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

English summary

Micromax launched Yu Yutopia in India . This phone was exclsively available on ly on ecommerce site Amazon.The sale of this smart phone is going to be start on 26th december