బ్రోతల్ కేసులో అడ్డంగా బుక్కైన 'యువ' హీరోయిన్

Yuva serial actress caught in prostitution

10:37 AM ON 28th June, 2016 By Mirchi Vilas

Yuva serial actress caught in prostitution

విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిపోయి, ఆ తర్వాత అవకాశాలు రాక కొందరు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడికి అనుగుణంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో మరికొందరు సెలెబ్రిటీలు ఈమధ్య నీచమైన పనులకు దిగజారిపోతున్నారు. వ్యాపారవేత్తలు - బాగా పేరున్న వ్యక్తులకు గాలం వేసి, తమ కామకోరికల్ని తీర్చుకోవడంతో పాటు డబ్బులను బాగా గుంజుతున్నారు. అయితే, ఈ మార్గాన్ని ఎంచుకున్న చాలామంది తారలు అడ్డంగా బుక్కయ్యారు. తాజాగా మరో టీవీ నటి కూడా ఈ బ్రోతల్ కేసులో రెడ్హ్యాండెడ్ గా దొరికేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని లక్డీకపూల్ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో కొన్నాళ్ళ నుంచి వ్యభిచారం గుట్టు సాగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు అపార్ట్ మెంట్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ పాపులర్ టీవీ నటి కూడా పట్టుబడడం అందరికీ షాకిచ్చింది. ఆమె పేరు, పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. అయితే తెలుగు యువ సీరియల్ ద్వారా ఆమె పాపులర్ అయిన నటి అని అంటున్నారు. అంతేకాదు.. ఆమె ఇతర సీరియల్స్ లోనూ లీడ్ రోల్స్లో నటిస్తోందని తెలిసింది.

ఇండస్ట్రీలో ఆమెకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది కూడా. అలాంటి అమ్మడు వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో అందరూ ఖంగుతిన్నారు. అంతటి పేరున్న ఈ నటికి వ్యభిచారంలో దిగాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆరాతీయగా, ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతోనే ఆమె ఈ రొంపిలోకి దిగినట్లు వినిపిస్తోంది. అయితే, ఆ నటిని అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ పై వదిలేశారు. ఇక మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఆ నటితో పాటు ఓ ప్రముఖ వ్యాపారవేత్త తనయుడు కూడా ఉన్నాడట. డబ్బున్న యువకులకు ఆ పాపులర్ నటి గాలం వేసి, వారిని సుఖపెట్టి, ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడేదని పోలీసుల విచారణలో తేలింది.

ఇప్పటికే ఈమె ఎంతోమందిని ఇలా బ్లాక్ మెయిల్ చేసి చాలా డబ్బులు సంపాదించిందని కూడా అంటున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

English summary

Yuva serial actress caught in prostitution