కోహ్లీ పెద్ద పిసినారి: యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

Yuvaraj Singh shocking comments on Virat Kohli

04:14 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Yuvaraj Singh shocking comments on Virat Kohli

ఇండియా క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీ అత్యంత పిసినారి అని యువరాజ్ సింగ్ చెప్పాడు. అతని తరువాత నెహ్రా కూడా అంతే పిసినారి అని చెప్పాడు. ఒక రేడియో ప్రోగ్రామ్ లో సరదాగా ముచ్చటించిన స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్.. టీమిండియా సభ్యుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. టీమిండియాలో అత్యంత పిసినారి స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీయేనని నవ్వుతూ చెప్పాడు. తాము కలిసి ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు నెహ్రా తన జేబులో నుంచి పైసా బయటకు తీసేవాడు కాదని చెప్పాడు. నెహ్రా జేబులో నుంచి డబ్బులు బయటకు తీయించడానికి తాను ఎంతో ప్రయత్నం చేశానని.. కానీ కుదిరేది కాదని చెప్పాడు.

తానెందుకు డబ్బులు ఖర్చు పెట్టడం లేదనే విషయాన్ని నెహ్రా చెప్పేవాడని.. భార్యా, పిల్లలు ఉన్నారని, అందుకే ఎక్కువగా ఖర్చు పెట్టలేనని నెహ్రా చెప్పేవాడని వివరించాడు. సీనియర్లు అయిన పలువురు ఆటగాళ్లలో కూడా చాలామంది పిసినార్లు ఉన్నారని యువీ చెప్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ లు కూడా ఈ జాబితాలో ఉంటారా? అని అడిగితే.. దాని గురించి వదిలేయాల్సిందేనని చెప్పాడు.

ఇది కూడా చదవండి: ఏపీలో బయట పడ్డ వజ్రాల నిధి!

ఇది కూడా చదవండి: ఇంట్లో ఈ విగ్రహాలు ఉంటే మీ పని అయిపోయినట్టే!

ఇది కూడా చదవండి: పాపం.. సొంత గ్రామస్థులే సన్నీని వెలేశారట!

English summary

Yuvaraj Singh shocking comments on Virat Kohli. Indian cricket team all rounder Yuvaraj Singh came to radio station as a chief guest. In that show he says that Virat Kohli is best Parsimonious in India cricket team.