గప్ చుప్ గా యువరాజ్ ఎంగేజ్ మెంట్ ....

Yuvi Gets Engaged Secretly

06:35 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Yuvi Gets Engaged Secretly

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కు ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది . గత కొంత కాలంగా యువరాజ్ తన ప్రేయసి హజెల్ కీచ్ తో డేటింగ్ చేస్తున్నాడు. అంతేకాక మొన్న జరిగిన హర్బజన్ సింగ్ , గీతా బస్రాల రిసెప్షన్ కు కుడా యువరాజ్ తన ప్రేయసి హజెల్ తో హాజరయ్యాడు. ఇది ఇలా ఉండగా దీపావళి రోజుని పురస్కరించుకుని ఈ జంట గుట్టుచప్పుడు కాకుండా ఇండోనేషియా లోని బాలి నగరంలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. రెండు రోజుల క్రితం హజెల్ తో యువరాజ్ సింగ్ డేటింగ్ పై అతడి తండ్రి యోగ్ రాజ్ సింగ్ స్పందిస్తూ హజెల్ ను పెళ్లి చేసుకుంటే యువరాజ్ టీమిండియాలో స్థానం దక్కే అవకాశముందని చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూర్చాయి.

English summary

Yuvi Gets Engaged Secretly