సినిమా పోయె... ధియేటరూ పోయె...

Y.V.S. Chowdary Bommarillu theatre was seized

01:59 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Y.V.S. Chowdary Bommarillu theatre was seized

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దగ్గర శిష్యురికం తీసుకున్న దర్శకుడు వె.వి.ఎస్‌. చౌదరి. తన మొదటి చిత్రం అక్కినేని నాగార్జున నిర్మాణంలో తెరకెక్కిన 'సీతారాముల కళ్యాణం చూతము రారండి' సూపర్‌ హిట్‌ కావడంతో ఆ వెంటనే నాగార్జున మరో అవకాశం ఇచ్చాడు. హరికృష్ణ-నాగార్జున అన్నదమ్ములగా తెరకెక్కిన 'సీతారామరాజు' అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ తరువాత మహేష్‌బాబుతో తెరకెక్కించిన 'యువరాజు' చిత్రం కూడా యావరేజ్‌ గా ఆడడంతో చౌదరికి అవకాశాలు తగ్గాయి. అయితే ఆ తరువాత వై.వి.ఎస్‌. చౌదరి తనే సొంతంగా నిర్మించి హరికృష్ణ హీరోగా 'లాహిరి లాహిరి లాహిరి లో' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం సూపర్‌హిట్‌ కావడంతో ఆ తరువాత సీతయ్య, దేవదాసు వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు తెరకెక్కించాడు.

అయితే ఆ తరువాత బాలకృష్ణతో తెరకెక్కించిన 'ఒక్కమగాడు', గుణశేఖర్‌ దర్శకత్వంలో తను నిర్మించిన 'నిప్పు' అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో చౌదరిని ఆర్ధికంగా బాగా దెబ్బ తీశాయి. అయితే ఆ తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ తో తెరకెక్కించిన 'రేయ్‌' చిత్రం రిలీజ్‌ అవ్వడానికి ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే చౌదరి గుడివాడలో తనకున్న 'బొమ్మరిల్లు' ధియేటర్‌ను తాకట్టు పెట్టి అనుకున్నట్లుగానే 'రేయ్‌' చిత్రాన్ని రిలీజ్‌ చేశాడు. ఈ చిత్రం అట్టర్‌ ఫాప్‌ కావడంతో చౌదరి ఆంధ్రాబ్యాంక్‌ వారు 'బొమ్మరిల్లు' ధియేటర్‌ను సీజ్‌ చేశారు.

English summary

Producer and Director Y.V.S. Chowdary's Bommarillu theatre was seized by Andhra Bank. Due to not recovering loan.