బంపర్ ఆఫర్ కొట్టిన జహీర్ ఖాన్

Zaheer Khan Selected As Delhi Daredevils Captain

06:37 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Zaheer Khan Selected As Delhi Daredevils Captain

తన బౌలింగ్ తో భారత్ కు ఎన్నో అపురూపమైన విజయాలను అందించిన జహీర్ ఖాన్ గత ఏడాది అక్టోబర్ లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. జహీర్ ఖాన్ తన కెరీర్ లో మొత్తం 92 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 311 వికెట్లు పడగొట్టాడు. భారత తరఫున 17 టీ20 మ్యాచ్ లు ఆడిన జహీర్ ఖాన్ కు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఒక కళ్ళు చెదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.

ఇవి కూడా చూడండి: కళ్ళజోడు మార్కులను (మచ్చలను) తొలగించటానికి చిట్కాలు

ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ సీజన్లో జహీర్ ఖాన్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పగ్గాలను అప్పగించింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరఫున 14 మత్చ్లు ఆడిన జహీర్ ఖాన్ కు ఇంత లేటు వయసులో కెప్టెన్సీ వరించింది. ఢిల్లీ జట్టు కెప్టెన్ గా నియమించబడడం ఒక్క గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు జహీర్ ఖాన్ అన్నాడు. ఢిల్లీ జట్టు మెంటర్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కుడా జహీర్ ను కెప్టెన్ గా నియమించబడడం పై సంతోషం వ్యక్తం చేసాడు . భారత క్రికెట్ జట్టు కు ఎన్నో అపురూప విజయాలను అందించిన జహీర్ ఖాన్ ఎప్పుడు తానెంతో నిరుపించుకుంటూ వచ్చాడని జహీర్ ను ద్రావిడ్ కొనియాడాడు.


మీకు , మీ పార్టీకి ఇంక సెలవు

డబ్బులు లేక 5 రూ. మ్యాగీ తినేవాడట

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది(ఫోటోలు)

English summary

Indian Senior Most Top Bowler Zaheer Khan Selected as the New Captain For Delhi Dare Devils Team.Zaheer Khan to captain Daredevils in IPL 2016