కోటి రూపాయల ఆఫర్ వదిలేసిన హీరోయిన్

Zarine Khan Rejects 1 Crore Endorsement Offer

03:41 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Zarine Khan Rejects 1 Crore Endorsement Offer

దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలని , డిమాండ్ ఉన్నప్పుడే రాబట్టుకోవాలని చాలామంది సినీ తారల యోచన. అందుకే ఎడా పెడా వచ్చే ఆఫర్లను వదులుకోరు. ఇక నటీనటుల డిమాండ్‌ని బట్టి వారికొచ్చే బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లు, పారితోషికాలు ఆధారపడి ఉంటాయి. అందులోనూ ఎక్కువ పారితోషికం ఇచ్చే సంస్థకి ప్రచారకర్తగా ఉండమని కోరితే ఎవరూ కాదనరు. అలాంటిది రూ.కోటి పారితోషికం ఇస్తామని ఓ సంస్థ ముందుకు వస్తే, నటి జరీన్‌ ఖాన్‌ తిరస్కరించింది.

ఇవి కూడా చదవండి: బన్నీ మాటలకు ఫ్యాన్స్ డిష్యుం డిష్యుం

ఆ బ్రాండ్‌ ఏ సౌందర్య ఉత్పత్తో, తినే పదార్థమో అయితే పర్వాలేదు. కానీ ఒక్కసారిగా బరువు తగ్గించే వెయిట్‌ లాస్‌ పిల్స్‌ అంటూ ఓ కంపెనీ ఈ ప్రతిపాదనను తెచ్చింది. ఇలాంటి నకిలీ మందులతో ప్రజల్ని మభ్యపెట్టడం ఇష్టంలేక జరీన్‌ ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అందులోనూ ఈ మధ్యే జరీన్‌ ఫిట్‌ అండ్‌ స్లిమ్‌గా మారింది. ‘రోజూ జిమ్‌లో కష్టపడి ఈ శరీరాకృతిని తెచ్చుకున్నా. బరువు తగ్గడానికి వ్యాయామం తప్ప ఎలాంటి షార్ట్‌కట్స్‌ లేవు’ అని చెప్తోంది. ఇప్పుడు జరీన్‌కి బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లతో పాటు సినిమా అవకాశాలు కూడా బానే వస్తున్నాయి. ప్రస్తుతం జరీన్‌ సాయి కబీర్‌ దర్శకత్వం వహిస్తున్న డివైన్‌ లవర్స్‌లో నటిస్తుండగా, ఆమెకి జంటగా ఇర్ఫాన్‌ ఖాన్‌ నటించనున్నాడు. రూ కోటి ఆఫర్ తిరస్కరణ నేపధ్యంలో మొత్తానికి ఈ అమ్మడుకి ఆదర్శాలు బానే వున్నాయని బాలీవుడ్ లో జనం చెవులు కొరుక్కుంటున్నారు.

ఇవి కూడా చదవండి: బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి: సెక్స్ లో అలా చేసి ప్రాణాలు కోల్పోయిన లేడి డాక్టర్

English summary

Bollywood Hot Heroine Zarine Khan rejects an Endorsement Offer worth One Crore . She was contacted by of the company to acts as their brand ambassador for Weight Loss Pills but she rejected that offer and she said that there were no short cuts to loose weight doing exercises were only the way to reduce weight.