టీవీ9 పై కన్నేసిన జీ గ్రూప్!

Zee group want to buy tv9

02:53 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Zee group want to buy tv9

జీ గ్రూప్ ఇప్పటికే టెలివిజన్ రంగంలో దూసుకుపోతుండగా, తాజాగా మరో టీవీపై కన్నేసిందని అంటున్నారు. టీవీ9 పేరుతో న్యూస్ ఛానెల్స్ ను నిర్వహిస్తున్న హైదరాబాద్ మీడియా సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్(ఎబిసిఎల్)లో మెజారిటీ వాటాలను చేజిక్కించుకునేందుకు జీ గ్రూప్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీని రాజు(పీపుల్స్ క్యాపిటల్).. ఈ మీడియా కంపెనీలో ప్రధాన వాటాదారుగా ఉన్నారు. ఎబిసిఎల్ ను 850 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు జీ గ్రూప్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఎబిసిఎల్.. టీవీ9, జైతెలంగాణ పేరుతో తెలుగులో వార్తా ఛానళ్లను... కన్నడ, మరాఠి, గుజరాతీ, ఇంగ్లీష్ సహా మొత్తం 7 ఛానల్స్ ను నిర్వహిస్తోంది.

ఎబిసిఎల్ ను విక్రయించేందుకు ప్రమోటర్లు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. గతంలోనూ ఈ మొత్తం ఛానల్స్ తో సహా ఎబిసిఎల్ కొనుగోలుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. అయితే డీల్స్ ఏవీ కుదరలేదు. తాజాగా జీ గ్రూప్ కన్సాలిడేషన్ లో భాగంగా ఎబిసిఎల్ మీద కన్నేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే టెన్ స్పోర్ట్స్ను జీ గ్రూప్.. సోనీకి 2,500 కోట్ల రూపాయలకు విక్రయించిన సంగతి తెలిసిందే. నగదు కూడా దండిగా ఉన్న కారణంగా ప్రాంతీయ భాషల్లో పట్టును చేజిక్కించుకునేందుకు జీ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది.

ఇది కూడా చదవండి: అండర్ వేర్ సీన్ లో చిరు?

ఇది కూడా చదవండి: ఈ 6 జంతువుల నుండి ఈ లక్షణాలు నేర్చుకుంటే జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదుగుతారట!

ఇది కూడా చదవండి: జ్యూస్ తాగిందని జాబ్ లోంచి తీసేసాడు.. కానీ 1.86 కోట్లు చెల్లించాడు.. ఎందుకు?

English summary

Zee group want to buy tv9. Zee group wan to buy tv9 channel.