ఇక నుంచి 24 గంటలూ 'జీ' సినిమాలు!

Zee launched its first movie channel in South india with Zee Cinemalu

11:33 AM ON 6th September, 2016 By Mirchi Vilas

 Zee launched its first movie channel in South india with Zee Cinemalu

అవునండి, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు జీ తెలుగు చానెల్ ఇప్పుడు సరికొత్తగా ‘జీ సినిమాలు’ పేరుతో 24 గంటల మూవీ చానెల్ ప్రారంభం.. సుభాష్ చంద్ర సారథ్యంలోని జీ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ కు చెందిన జీ తెలుగు ఇప్పటికే తెలుగులో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాందించుకున్నారు కదా. జీ తెలుగు చానెల్ , మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం కాగా, తాజాగా జీ సినిమాలు చానెల్ ను కూడా చిరంజీవి లాంఛనంగా ప్రారంభించనున్న ట్లు చెబుతున్నారు.

పలు సూపర్ హిట్ సినిమా టైటిల్స్ తో కూడిన భారీ లైబ్రరీని జీ సినిమా ఇప్పటికే సిద్ధం చేసింది. వీటితో పాటు సరికొత్త సినిమాలైన బ్రహ్మోత్సవం, అఖిల్ , కుమారి 21 ఎఫ్ , సుప్రీమ్ , బాబు బంగారం వంటి సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతోంది. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ కు చెందిన హిట్ సినిమాలు జీ లైబ్రరీకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. హిట్ సినిమాలతో పాటు మరింత వినోదాన్ని పంచేందుకు సరికొత్త కార్యక్రమాలు జీ సినిమాలు చానెల్ లో ప్రసారం కానున్నాయి. ఫేస్ ఆఫ్ ది చానెల్ గా నటి విద్యుల్లేఖను జీ సినిమాలు ప్రమోట్ చేస్తోంది. ఇక సినిమాలే సినిమాలు.

ఇది కూడా చూడండి: అగ్ర రాజ్య నేతకు షాకిచ్చిన చైనా

ఇది కూడా చూడండి: ఓ ఇంటివాడైన మనం విక్రమ్ కె కుమార్

ఇది కూడా చూడండి: రజనీ దుర్యోధనుడు ... మోహన్ బాబు కర్ణుడు

English summary

Zee launched its first movie channel in South india with Zee Cinemalu.