జూమ్ కెమేరాతో ఆసుస్ జెన్‌ఫోన్ జూమ్ 

zenphone with zoom camera

05:22 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

zenphone with zoom camera

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఆసుస్.. జెన్ ఫోన్ జూమ్ పేరుతో కొత్త ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఇది తైవాన్‌లో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇతర దేశాల్లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందన్న వివరాల్ని మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే ఫొటోగ్రాఫర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని రూపొందించినట్లు చెప్పింది. ఈ ఫోన్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయని తెలిపింది.

64 జీబీ మెమొరీ, 2.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్ గల వేరియంట్ ధర దాదాపుగా రూ.28,500 ఉంటుంది. 128 జీబీ మెమొరీ, 2.5 గిగాహెడ్జ్ ప్రాసెసర్ గల వేరియంట్ ధర దాదాపుగా రూ.32,500గా నిర్ణయించింది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ తాకే తెర.. 1080X1920 పిక్సల్స్ రిజల్యూషన్ ధీని ప్రత్యేకత. 13 మెగాపిక్సల్ కెమేరా(3 ఎక్స్ ఆప్టికల్ జూమ్).. 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమేరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 5.0 ఆపరేటింగ్ సిస్టంతో పని చేసే ఈ ఫోన్లో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇన్ బిల్డ్ గా ఇచ్చారు.

English summary

Famous Electronic company Asus released its new smart phone called zenfone zoom into the mobile market. Presently this phone was available only in taiwan,3x optical zoom was the major feature in this phone