బ్రెజిల్ ను భయపెడుతున్న ‘జికా’

Zika virus is spreading in bresil And Could Causing Birth Defects

05:24 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Zika virus is spreading in bresil And Could Causing Birth Defects

లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్ ఇప్పుడు భయపడుతోంది. ఒకే ఒక్క వైరస్ ఇప్పుడు బ్రెజిల్ వాసులను వణికిస్తోంది. దాని పేరే జికా. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ కారణంగా మెదడులో లోపాలతో పిల్లలు పుడుతున్నారు. ఇలాంటి శిశువుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ దేశ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జికా వైరస్ గా పిలవబడుతున్న వెస్ట్ నిలే వ్యాధి కారకాన్ని 70 ఏళ్ల క్రితం ఆఫ్రికా అడవి కోతుల్లో తొలిసారి గుర్తించారు. దీని కారణంగా నాడీ సంబంధ రుగ్మతలు వస్తాయని, కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశముందని బ్రెజిల్ ఆరోగ్య శాఖ చెపుతోంది. శుష్కించిన శిరస్సు(మైక్రోసెఫలే)తో జన్మించిన శిశువుల్లో జికా వైరస్ ను గుర్తించినట్టు వెల్లడించింది. ఇలాంటి శిశువులకు జన్మనిచ్చిన తల్లుల అపరాయు ద్రవంలోనూ ఈ వైరస్ ను కనుగొన్నట్టు తెలిపింది. జికా వైరస్ కారణంగా ప్రపంచ సైన్స్ పరిశోధనా రంగం మునుపెన్నడూ లేని క్లిష్గట పరిస్థితిని ఎదుర్కొంటోందని పేర్కొంది. బ్రెజిల్ లో ఈ ఏడాది ఇప్పటివరకు 2,400 మందిపైగా మైక్రోసెఫలే బారిన పడ్డారు. వీరిలో 29 మంది చనిపోయారు. గతేడాది 147 మైక్రోసెఫలే కేసులు నమోదయ్యాయి. అయితే జికా వైరస్ వ్యాప్తిని ఎలా నిరోధించాలనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే దోమల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని బ్రెజిల్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జికా వైరస్ ను వ్యాప్తి చేసే ఎడిస్ ఏజిప్టి దోమలను నియత్రించేందుకు ఇంటింటికీ దోమ నిర్మూలన బృందాలను పంపుతోంది. దీంతో ప్రెగ్నెన్సీ సమయంలో జాగ్రత్తా ఉండాలని ప్రజలకు సూచిస్తోంది.

English summary

The Zika virus spreading fast in pregnancy women. It causing microcephaly in babies born to monther. Reports saying that it soon spread america.