చెన్నై వరద భాదితులకు జొమాటో సహాయం

Zomato Offers Flood Relief Meal At 100

12:02 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Zomato Offers Flood Relief Meal At 100

చెన్నై మహా నగరంతో పాటు చెన్నై సమీపం లోని అనేక తీర ప్రాంతాలు ఎడతెరిపి లేని వర్షాలతో మునిగిపోయాయి. చెన్నైలో ఎక్కడ చూసిన వరదనీరుతో నిండిపోయి చెరువులా కనిపిస్తుంది. బయటవారితో సత్సంభందాలు పూర్తిగా తెగిపోయాయి. రోడ్డు, రైలు, విమాన సర్వీసులు కూడా పూర్తిగా ఆగిపోయాయి.

చెన్నై లో గత వందేళ్ళలో ఇటువంటి వర్షాలు పడలేదు.ఇప్పుడు కురిసిన భారి వర్షాలకు చెన్నైలోని వాడపలాని, వలసరవక్కం, నందంవక్కం లోని చెరువులు నిండిపోయి బయటకి నీరు చేరింది.

ఇప్పటికే అనేక సంస్థలు వరద భాదితులకు ఉచిత భోజన సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్రొవైడర్‌ జొమాటో సంస్థ చెన్నై వరద భాదితులకు వివిథ ప్యాకేజిలతో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా జొమాటో వివిధ రెస్టారెంట్ల నుండి కేవలం 100 రూపాయల నుండి తమ సర్వీసును ప్రారంబించింది.

జొమాటో సంస్థ వారు మాట్లాడుతూ 100 రూపాయలకు ఇద్దరికి, 200 రూపాయలకు నలుగురికి, 5000 రూపాయలకు 100 మంది కి భోజన్నాన్ని అతి తక్కువ ధరలో అందిస్తున్నామని చెప్పారు. ఆర్డరు చేసిన 30 నిమిషాల్లోనే డెలివరి చేస్తామని తెలిపారు.

English summary

Famous Online Food Delivery Company Zomato offers flood relief meals starting at rupees 100 in chennai