చిన్నారి పట్ల క్రూరంగా ప్రవర్తించిన గొరిల్లా హతం

Zoo employees killed Gorilla for 4 years child

10:46 AM ON 30th May, 2016 By Mirchi Vilas

Zoo employees killed Gorilla for 4 years child

ఓహియోలోని సిన్సినాటి జూలో ఇదో దారుణం. ప్రమాదవశాత్తూ గొరిల్లాల ఎన్క్లోజర్లో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారిని రక్షించడానికి జూ సిబ్బంది ఓ గొరిల్లాను కాల్చి చంపారు. ఈ జూకి వచ్చిన ఓ కుటుంబంలో ఈ కుర్రాడు అనుకోకుండా సుమారు 12 అడుగుల లోతున్న గొరిల్లాల ఎన్క్లోజర్లో పడ్డాడు. ఆ సమయంలో అక్కడ మూడు గొరిల్లాలు ఉన్నాయని, వీటిలో రెండు ఆ బాలుడికి దూరంగా వెళ్లిపోగా, హరాంబే అనే 17 ఏళ్ళ వయసున్న గొరిల్లా మాత్రం వెళ్ళకుండా ఆ చిన్నారిని పట్టుకుని విసరడంతో తీవ్రంగా గాయపడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో అతడ్ని రక్షించేందుకు హరాంబేను సిబ్బంది కాల్చి చంపారు.

గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో జూ అధికారులు విడుదల చేశారు. గొరిల్లా బాలుడి పట్ల క్రూరంగా ప్రవర్తించిన దృశ్యాలను డిలిట్ చేసినట్టు వారు పేర్కొన్నారు.

English summary

Zoo employees killed Gorilla for 4 years child