స్యూసైడ్ కోసం దూకి - రెండు సింహాల్ని చంపించాడు...

Zoo officials killed two lions to save suicidal man in Santiago

10:47 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Zoo officials killed two lions to save suicidal man in Santiago

ఇదో రకం సూసైడ్ కేసు. చివరికి దారుణం జరిగిపోయింది. 20 ఏళ్ళ యువకుడొకడు సింహాలున్న ఎన్‌క్లోజర్‌లోకి దూకి సూసైడ్ చేసుకోబోయాడు. శాంటియాగో మెట్రోపాలిటన్ జూలో అందరూ చూస్తుండగానే తన దుస్తులు విప్పి.. నగ్నంగా ఆఫ్రికా సింహాలున్న ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు.

అతడ్ని చూసిన వెంటనే రెండు సింహాలు దూసుకు వచ్చి అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ హటాత్ సంఘటనను గమనించి బిత్తరపోయిన జంతుశాల సిబ్బంది తేరుకుని అతడ్ని రక్షించేందుకు సింహాలను కాల్చి చంపారు. గాయాలతో పడి ఉన్న ఆ యువకుడిని ఫ్రాంకో లూయీస్ ఫెరాడాగా గుర్తించామని, అతడ్ని ఆసుపత్రికి తరలించామని జూ సిబ్బంది తెలిపారు.

ఈ మృగరాజుల్లో ఒకటి మగది..మరొకటి ఆడదని, మత్తుమందుతో కూడిన సాధనం లేనందున వాటిని కాల్చి చంపాల్సి వచ్చిందని వారు చెప్పారు. కాగా..లూయీస్ దుస్తుల్లో సూసైడ్ నోట్ దొరికిందట. డిప్రెషన్ కారణంగా జీవితంపై విరక్తి చెంది సింహాలకు ఆహారం కాదలిచానని లూయీస్ అందులో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. ఇలాంటి దుస్సాహసం తో ఆత్మహత్యలు చేసుకోవడం ఏమిట్రా బాబూ అంటూ అక్కడున్న వారు తల బాదుకున్నారట.

ఇవి కూడా చదవండి:‘గ్యారేజ్’ ఫస్ట్‌లుక్‌ పై సంపూ పంచ్

ఇవి కూడా చదవండి:వంటవాడిగా మారిన భూటాన్ రాజు

ఇవి కూడా చదవండి:సెంట్ కోసం తొడలు చూపిస్తున్న సన్నీ

English summary

A Man In Santiago committed suicide by Jumping into a Lion Cage in a Zoo. When that man jumped lions attacked on him and zoo staff immediately killed two lions and taken that man into hospital.