టీచర్లు ఆలస్యంగా వస్తున్నారని .....

Z.P.Chairman Punished Himself

01:40 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Z.P.Chairman Punished Himself

ఆ మధ్యన ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నానంటూ.. ఎండలో నిలుచొని తనకు తాను శిక్ష విధించుకొని వార్తల్లోకి ఎక్కిన ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు తాజాగా మరోసారి ఎవరో చేసిన తప్పుకు తాను శిక్ష విధించుకున్నారు. ఒక రాజకీయ నేతకు.. అందులో పదవిలో ఉన్న ఒక నేత ఇంత సున్నితంగా ఉండడమా అని అందరూ విస్మయానికి గురువతున్నారు.

తాజా శిక్ష విషయానికి వస్తే, ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం జడ్పీ హైస్కూల్ కు ఆయన ఉదయం 9.40 గంటలకు వెళితే.. పాఠశాలలో మొత్తం 15 మంది ఉపాధ్యాయులకు కేవలం ఐదుగురు మాత్రమే ఆ సమయానికి వున్నారు. ప్రేయర్ ముగిసిన తర్వాత హెచ్ ఎంతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు వస్తే.. మిగిలిన ఐదుగురు అసలు బడికే రాని పరిస్థితి. దీంతో సీరియస్ అయిన ఆయన.. వారి హాజరు పట్టిక మీద తన అభిప్రాయాన్ని రాయడంతో పాటూ టీచర్లు చేసిన తప్పునకు తనకు తానే శిక్ష విధించుకున్నారు.

స్కూల్లో సరస్వతీదేవి విగ్రహం ఎదుట 10 నిమిషాలు ఎండలో హరిబాబు నించోవడంతో టీచర్లకు వణుకు పుట్టించింది. కర్ణాటకలో ఉపాధ్యాయులకు జీతాలు రిటైర్ అయ్యే నాటికి రూ.40వేల మించవని..కానీ.. ఏపీలో మాత్రం రూ.80 నుంచి రూ.90 వేల వరకు ఉన్నాయని.. అంత జీతం తీసుకుంటున్నప్పుడు అంతే బాధ్యతగా పని చేయాలని హరిబాబు వ్యాఖ్యానించారు. ఈవిధంగా తనకు తానే శిక్ష విధించుకుంటున్న ఈదర హరిబాబు గాంధీగిరి కి పలువురు హేట్సాఫ్ చెబుతున్నారు.

English summary