జడ్‌టీఈ నుంచి ఏక్సన్‌ మ్యాక్స్‌ 

ZTE Axon Max Smart Phone Launched

04:32 PM ON 21st December, 2015 By Mirchi Vilas

ZTE Axon Max Smart Phone Launched

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ జడ్‌టీఈ.. ఆరు అంగుళాల తాకే తెరతో సరికొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఏక్సన్‌ మ్యాక్స్‌ పేరుతో కొత్త స్మార్ట్‌ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని ధర దాదాపుగా రూ.28,600. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా ఈ ఫోన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఆరు అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే, 1080×1920 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 3జీబీ ర్యామ్ ఆక్టాకోర్‌ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌, 16జీబీ రేర్‌ కెమేరా, 13 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, యూఎస్‌బీ టైప్-సి, బ్లూటూత్ 4.0,32జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో 128జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం వంటి ఫీచర్లు ఉన్నాయి. 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌ చేసే ఈ ఫోన్ 4140 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. క్విక్ చార్జ్ సదుపాయం కూడా ఉంది. 0 నుంచి 60 శాతానికి 30 నిమిషాల్లోనే చార్జ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ ఫోన్ గోల్డ్ కలర్ లో మాత్రమే లభ్యమవుతోంది.

English summary

ZTE launched its new smart phone Axon Max, to markets "soon". The Chinese tech firm last week finally launched the handset in China priced at CNY 2,799 (roughly Rs. 28,600) via an e-commerce website