జడ్‌టీఈ నుంచి బ్లేడ్‌ డీ2 

ZTE Blade D2 Smartphone

04:53 PM ON 8th March, 2016 By Mirchi Vilas

ZTE Blade D2 Smartphone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ జడ్‌టీఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. బ్లేడ్‌ డీ2 పేరిట ఈ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.8,000. ప్రస్తుతం ఇది వియత్నాంలో మాత్రమే లభ్యమవుతోంది. ఇతర దేశాల్లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని జడ్ టీఈ వెల్లడించలేదు.

బ్లేడ్ డీ2 ఫీచర్లు ఇవే..

5 అంగుళాల తాకే తెర, 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 5.0 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 1.3 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ అంతర్గత మెమొరీ, ఎస్‌డీ కార్డుతో మెమొరీని 64జీబీ వరకు పెంచుకునే సదుపాయం, 5 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 2 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా

English summary

Chineese Mobile company ZTE launched a new smartphone named ZTE Blade D2.The price of this smartphone was Roughly 8,100 rupees.This smartphone comes with the key features like 5 inch Display,2 Mega Pixel Front Camera, 5 Mega pixel Rear Camera,1GB RAM,4000mAh Battery etc.