జడ్‌టీఈ నుంచి నుబియా స్మార్ట్‌ఫోన్‌

ZTE Launched Nubia Smartphone

04:23 PM ON 21st January, 2016 By Mirchi Vilas

ZTE Launched Nubia Smartphone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ జడ్‌టీఈ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ని మార్కెట్లోకి తెచ్చింది. నుబియా ప్రేగ్‌ ఎస్‌ పేరుతో దీనిని విడుదల చేసింది. దీని ధర దాదాపుగా రూ.25,600. ప్రస్తుతం చైనాలో మాత్రమే ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ మిగిలిన దేశాల్లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని సంస్థ ఇంకా వెల్లడించలేదు. సిల్వర్‌, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభించనుంది.

నుబియా ప్రేగ్ ఎస్ ఫీచర్ల ఇవే..

5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080×1920 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, ఓక్టా కోర్‌ ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, 64జీబీ అంతర్గత మెమొరీ, ఎస్‌డీ కార్డుతో 128 జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం, 13 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌, 2200 ఎంఏహెచ్‌ బ్యాటరీ మొదలైనవి.

English summary

ZTE launched Nubia Prague S smartphone.This phone comes with 5.2 inches display,cta-core Qualcomm Snapdragon 615 processor,3GB RAM,Android 5.1 ,2200mAh bvattery