జుకెర్ జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క రోజు

Zucker Berg Crosses Oracle CEO Larry Ellison

01:51 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Zucker Berg Crosses Oracle CEO Larry Ellison

అందరికీ నిత్య కృత్యంగా మారి,సోషల్ మీడియాలో అగ్రగామిగా దూసుకుపోతున్న ‘ఫేస్‌బుక్‌’ మరో మైలు రాయిని దాటింది. దీని ఆదాయం అమాంతం పెరిగిపోయింది. ఆదాయం ఒక్కరోజులోనే ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. బుధవారం ఒక్కరోజే సంస్థ ఆదాయం అక్షరాలా 4.85 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ట్రేడింగ్‌లో సంస్థ షేర్లు అమాంతం పెరగడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. దీంతో ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రపంచ సంపన్నుల్లో ఆరోస్థానంలో నిలిచారు. అంతేకాకుండా ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ‘ఒరాకిల్‌’ ఛైర్మన్‌ లారీ ఎలిసన్‌ను అధిగమించి ఆరో స్థానానికి ఎగబాకాడు. బుధవారం ఫేస్‌బుక్‌ స్టాక్స్‌ 12 శాతం పెరిగాయి. దీంతో ఒక్కరోజునే జుకర్‌బర్గ్‌ ఆస్తి 4.85 బిలియన్‌ డాలర్లకు పెరగడంతో, 46.25 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతో లారీ ఎలిసన్‌ కన్నా జుకర్‌బర్గ్‌ సంపద సుమారు 2.5 బిలియన్‌ డాలర్లు పెరగ్గా..ఎలిసన్‌ సంపద 43.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

2015 నాలుగో త్రైమాసికంలో సంస్థ రెవెన్యూ 52శాతం పెరిగినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. పెరిగిన రెవెన్యూలో 5.84 బిలియన్‌ డాలర్లలో 80శాతం మొబైల్‌ రెవెన్యూ అని ఫేస్‌బుక్‌ స్పష్టం చేసింది. అలాగే అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది ఫేస్‌బుక్‌ వినియోగదారులు 17శాతం అధికంగా పెరిగినట్లు తెలిపింది. చిన్న వయసులో ఫేస్‌బుక్‌ సీఈఓ గా రూపాంతరం చెంది, ప్రపంచ సంపన్నుల్లో ఒకడిగా జుకర్‌బర్గ్‌ నిలిచిన సంగతి తెలిసిందే. 2015 సెప్టెంబరు నివేదిక ప్రకారం ప్రపంచంలోని 10 మంది సంపన్నుల్లో అత్యంత పిన్న వయస్కుడు కావడం విశేషం.కాగా గత ఏడాది ఫోర్బ్స్‌ విడుదల చేసిన జాబితాలో అమెరికాలో తొలి పదిమంది సంపన్నుల జాబితాలో జుకర్‌బర్గ్‌ స్థానం సంపాదించాడు. మున్ముందు మరిన్ని ఆవిష్కరణలో జుకర్ దూసుకుపోటాడని అంచనా వేస్తున్నారు.

English summary

Facebook CEO and Co-Founder Mark Zucker Berg Crosses Oracle CEO Larry Ellison in earnings.On wednesday Facabook shares hits 12 % profit.In fourth Quarter of 2015 facebook,s earnings increases by 52 %