ముస్లింలకు మద్దతు తెలిపిన జుకర్‌ బర్గ్‌ 

Zucker Berg Supports Muslims

03:14 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Zucker Berg Supports Muslims

ఫేస్‌బుక్‌ వ్యవస్ధాపకుడు, సిఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ముస్లింలకు మద్దతుగా నిలిచారు. ఇతరుల చర్యల వల్ల అందరు ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు.

అమెరికాలోకి ముస్లింలను రాకుండా వారిని బ్యాన్ చెయ్యాలన్న రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు డోనాల్డ్ ట్రంప్‌ చేసిన వాఖ్యల నేపధ్యంలో జుకర్‌బర్గ్‌ ఇలా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిసింది. ఎక్కడో, ఎవరో పాల్పడిన దాడులకు ముస్లింలు అందరూ భాదపడవలసిన అవసరం లేదని అన్నాడు. పారిస్‌ ఉగ్రదాడులు, వేరే దాడుల జరిగిన నేపధ్యంలో అందరి ముస్లింల పై విపక్షం చూపడం సరికాదని జుకర్‌బర్గ్‌ అన్నాడు.

ఒక జ్యూ మతస్తుడిగా ఎవరి పై దాడి చేసినా వారికి ఎదురు నిలివాలని తన తల్లిదండ్రులు చెప్పినట్లు జుకర్‌ బర్గ్‌ తెలిపాడు.

మీరు ఈ సమాజంలో ముస్లిం అయితే, ఫేస్‌బుక్‌ అధినేతగా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం శాంతియుతమైన, వివక్షరహిత సమాజం కోసం పోరాటానికి ఆహ్వనిస్తున్నాని జుకర్‌బర్గ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో తెలిపాడు.

English summary

Facebook founder Mark Zuckerberg said that he wants to protect the rights of Muslims